హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని తెలంగాణ డాక్టర్స్ ఫెడరేషన్(టీడీఎఫ్) ఆరోపించింది. గురువారం టీడీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు విజయేందర్, జనరల్ సెక్రటరీ ఎండీ నిదాఉల్లా ప్రకటన విడుదల చేశారు.
మెరిట్ ఆధారంగా జరగాల్సిన సెలక్షన్ ప్రక్రియలో నిబంధనలు పాటించలేదని మండిపడ్డారు. అభ్యర్థుల నుంచి రూ.12లక్షల నుంచి రూ.20లక్షల వరకు డబ్బులు డిమాండ్ చేసి ఉద్యోగాలు ఇచ్చి నియామకాలు చేపట్టినట్టు ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ఈ నియామక ప్రక్రియపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.