బన్సీలాల్‌పేట్, మే 30 : తెలంగాణలోని ప్రభుత్వ దవాఖానాల్లో రోగులు, డ్యూటీ డాక్టర్లకు ఆహారం సరఫరా చేస్తున్న డైట్ క్యాంటీన్లకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ డైట్ క్యాంటీన్ సప్లయర్స్ వెల్ఫేర్ అసోసియేన్ ప్రతినిధులు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, డీఎంఈ డాక్టర్ ఎన్ వాణి, వైద్యశాఖ కమిషనర్‌ను గురువారం కలిసి వినతిపత్రాలు అందజేశారు.
ఏడాది కాలంగా బిల్లులు రాకపోవడంతో క్యాంటీన్లు నడపడం కష్టంగా మారిందని చెప్పారు. సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో రూ.5 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని కాంట్రాక్టర్ రవికుమార్ తెలిపారు. ఉస్మానియా, నిలోఫర్, పెట్లబుర్జు, సంగారెడ్డి, వరంగల్, సూర్యాపేట ప్రభుత్వ దవాఖానలకు ఆహారం సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లు తమ ఆర్థిక ఇబ్బందులను వివరించారు.