హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రత్యేక పోలీస్ విభాగం(టీజీఎస్పీ)లో బాక్సింగ్, క్రికెట్ కోచింగ్ కేంద్రాలు నెలకొల్పాలని యోచిస్తున్నట్టు డీజీపీ జితేందర్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా టీజీఎస్పీ బెటాలియన్లలో శిక్షణ పూర్తిచేసుకున్న కానిస్టేబుళ్లకు దీక్షాంత్ పరేడ్ నిర్వహించారు. యూసుఫ్‌గూడ బెటాలియన్ పరేడ్‌కు డీజీపీ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. అంతర్జాతీయ స్థాయిలో బాక్సింగ్, క్రికెట్లో రాష్ట్ర ఖ్యాతిని చాటిన నిఖత్ జరీన్, మహమ్మద్ సిరాజ్‌ను డీఎస్పీలుగా ప్రభుత్వం నియమించిందని గుర్తుచేశారు. కార్యక్రమంలో నిఖత్ జరీన్, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.