DSP Transfers | రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో పని చేస్తున్న 24 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ అంజినీకుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సివిల్ విభాగంలో వెయిటింగ్ లో ఉన్న డీఎస్పీ భూక్యా నారాయణను జయశంకర్ భూపాలపల్లి డీసీఆర్బీ విభాగం డీఎస్పీగా నియమించారు. ప్రస్తుతం వెయిటింగ్ లో ఉన్న డీఎస్పీ ఎన్ తిరుపతి రావును సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఈఓడబ్ల్యూ-2 ఏసీపీగా బదిలీ చేశారు. సివిల్ విభాగంలో వెయిటింగ్లో ఉన్న బీ విఠల్ రెడ్డిని నల్గొండ జిల్లా డీటీసీ డీఎస్పీగా ట్రాన్స్ ఫర్ చేశారు.
సివిల్ విభాగంలో పోస్టింగ్ కోసం వేచి చూస్తున్న మారెడ్డి రవీందర్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీగా నియమించారు. సివిల్ విభాగంలో నియామకం కోసం వెయిటింగ్ లో ఉన్న బీ శ్రీనివాసులును హైదరాబాద్ పీసీఎస్ అండ్ ఎస్ అండ్ ఐటీ సెల్ ఏసీపీగా బదిలీ చేశారు. వెయిటింగ్ లో ఉన్న మరో డీఎస్పీ కే పీటర్ వత్సల రాజును హైదరాబాద్ లోని రాష్ట్రస్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్ డీఎస్పీగా ట్రాన్స్ ఫర్ చేశారు. సివిల్ విభాగంలో పోస్టింగ్ వేచి చూస్తున్న డీఎస్పీ బీ సైదాను నల్గొండ డీసీఆర్బీ విభాగం డీఎస్పీగా బదిలీ చేశారు. అక్కడ పని చేస్తున్న వై రమేశ్ ను ఖాళీగా ఉన్న ఏసీబీ డీఎస్పీగా నియమించారు.
పోస్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్న డీ రమణారావును వరంగల్ సీటీసీ ఏసీపీగా నియమించారు. అక్కడ పని చేస్తున్న పీ సాంబయ్యను సిద్దిపేట కమిషనరేట్ సీసీఎస్ ఏసీపీగా ట్రాన్స్ ఫర్ చేశారు. సివిల్ విభాగంలో పోస్టింగ్ కోసం వేచి చూస్తున్న మాజిద్ అలీ ఖాన్ను ఖాళీగా ఉన్న ఏసీబీ డీఎస్పీగా నియమించారు. బీ శ్రీరామ్ రెడ్డి (సివిల్ విభాగంలో పోస్టింగ్ కోసం)ని ఏసీబీ డీఎస్పీగా ట్రాన్స్ ఫర్ చేశారు. సివిల్ విభాగంలో పోస్టింగ్ కోసం వేచి చూస్తున్న ఎంవీ శ్రీనివాసరావు, వీవీ రమణమూర్తి, సీహెచ్ శ్రీనివాస్ జీలను ఏసీబీ విభాగంలో ఖాళీగా ఉన్న డీఎస్పీ పోస్టుల్లో నియమించారు.
సివిల్ విభాగంలో పోస్టింగ్ కోసం వేచి చూస్తున్న డీఎస్పీ బీ ఆంజనేయులు, కే పాండురంగారెడ్డి, ఈ శ్రీనివాసరెడ్డి, వై నాగేశ్వరరావులను డీజీపీ ఆఫీసులో డీజీ కంట్రోల్ రూమ్ లో నియమించారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని టాస్క్ ఫోర్స్ ఏసీపీగా పని చేస్తున్న ఎం జితేందర్ రెడ్డిని ఖాళీగా ఉన్న వరంగల్ సీఎస్బీ విభాగం డీఎస్పీగా ట్రాన్స్ ఫర్ చేశారు. పోస్టింగ్ కోసం వేచి చూస్తునన ఎల్ రమేశ్ కుమార్ ను వరంగల్ కమిషనరేట్ పరిధిలోని ఎస్బీ అండ్ సెక్యూరిటీ ఏసీపీగా నియమించారు. అక్కడ పని చేస్తున్న ఎం భోజరాజును వరంగల్ ట్రఫిక్ ఏసీపీగా నియమించారు. వరంగల్ ట్రాఫిక్ ఏసీపీగా పని చేస్తున్న ఏ మధు సూదన్ ను వరంగల్ టాస్క్ ఫోర్స్ ఏసీపీగా బదిలీ చేశారు.