రూ.5వేల కోట్ల అదనపు సాయమివ్వండి
అభివృద్ధి, సంక్షేమ పథకాల వేగాన్ని పెంచేందుకు ప్రత్యేక సహాయ పథకం(ఎస్ఏఎస్సీఐ) కింద తెలంగా ణకు అదనంగా రూ.5వేల కోట్ల ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార కేం ద్రాన్ని కోరారు.
- విద్యారంగ ప్రాజెక్టులకు ఎఫ్ఆర్బీఎం పరిమితుల నుంచి మినహాయింపు ఇవ్వండి
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క వినతి
హైదరాబాద్, మే 20(నమస్తే తెలంగాణ) : అభివృద్ధి, సంక్షేమ పథకాల వేగాన్ని పెంచేందుకు ప్రత్యేక సహాయ పథకం(ఎస్ఏఎస్సీఐ) కింద తెలంగా ణకు అదనంగా రూ.5వేల కోట్ల ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార కేం ద్రాన్ని కోరారు. రాష్ట్ర అభివృద్ధి, వి ద్యారంగంలో భారీ పెట్టుబడులు, మౌలి క వసతుల విస్తరణే లక్ష్యంగా బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆయన సమావేశ మ య్యారు. విద్యాప్రాజెక్టుల రుణాలను రాష్ట్ర ఎఫ్ఆర్బీఎం పరిమితుల నుంచి మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా కోల్ గ్యాసిఫికేషన్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో, సింగరేణి కూడా ఆ దిశగా ముందడుగు వేసేందుకు సిద్ధంగా ఉన్నదని భట్టి విక్రమార పేర్కొన్నారు. ఈ మేరకు అవసరమైన సాంకేతిక మార్గదర్శకత్వం, విధానపరమైన సహకారం, కేంద్ర పథకాల అనుసంధానంలో బొగ్గు మంత్రిత్వశాఖ సహకారం అందించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డిని ఆయన కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

