Minister KTR | రాజన్న సిరిసిల్ల, జూన్ 2 (నమస్తే తెలంగాణ): తొమ్మిదేండ్లలోనే తెలంగాణ అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకున్నదని, అభివృద్ధి, సంక్షేమం లో యావత్తు దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచిందని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ చెప్పారు. సీఎం కేసీఆర్ మానవీయ దృక్పథం, నిర్మాణాత్మకఆలోచన, దార్శనికమైన ప్రణాళికా రచన, పారదర్శకమైన పరిపాలన.. వీటన్నింటితో తెలంగాణ మాడల్ నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు పొందుతున్నదని వివరించారు. సంక్షేమ పథకాలను భారీ ఎత్తున నిరాటంకంగా అమలు చేయడం తెలంగాణకే సాధ్యమైందని స్పష్టం చేశారు. మిషన్ భగీరథ ద్వారా 75 ఏండ్ల స్వాతంత్య్రానంతరం తొలిసారి తాగునీటి కష్టాలను సంపూర్ణంగా అధిగమించిన రాష్ట్రంగా నిలువడం, దానిని ప్రేరణగా తీసుకుని హర్ ఘర్ జల్ పథకాన్ని కేంద్రం చేపట్టడం తెలంగాణ బిడ్డలుగా మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు.
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన వే డుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉ దయం 8.45 గంటలకు నేతన్నచౌక్‌లో అమరవీరుల స్థూపం వద్ద పూలు చల్లి నివాళులర్పించారు. తర్వాత కలెక్టరేట్‌కు చేరుకుని జాతీయ పతాకాన్ని ఆవిష్కరిం చి, ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అధికారులు రూ పొందించిన కాపీటేబుల్ బుక్, రైతు దినోత్సవ పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లా ప్రగతిపై నిర్మించిన డాక్యుమెంటరీని తిలకించారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో తేనీటి విందులో పాల్గొన్నారు. తర్వాత తంగళ్లపల్లి మండలంలో కార్యకర్తల ఇండ్లలో జరిగిన శుభకార్యాలకు హాజరయ్యారు.
ప్రతి ధాన్యం గింజనూ కొనే ఏకైక రాష్ట్రం
రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చే సే రాష్ట్రం తెలంగాణ తప్ప మరొకటి లేదని కేటీఆర్ తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో ఎకరాకు 12 టన్నులు మా త్రమే సీలింగ్ పెట్టి కొనుగోలు చేస్తారని, మిగిలినదంతా రైతులు మార్కెట్లో అమ్ముకోవాల్సిందేనని చెప్పారు. పెరిగిన ధాన్యం ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకు ని కొనుగోళ్లు చేస్తున్నామని, రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడి రైతు సంక్షేమ విధానాలు అమలు చే యాలంటూ పొరుగు రాష్ర్టాల ప్రభుత్వాలపై ప్రజలు ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. ఉత్పత్తులను నిలువ చే సుకునేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున గోదాముల నిర్మా ణం చేపట్టిందని వివరించారు.
సిరిసిల్లకు పరిశ్రమలు
గంభీరావుపేట మండలం నర్మాలలో 309 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ పార్క్, రూ. 150 కోట్లతో మూడు పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నట్టు కేటీఆర్ వెల్లడించారు. 800 మంది స్థానికుల కు ఉపాధి లభించే అవకాశం ఉన్నదని చెప్పారు. ము స్తాబాద్ మండలం బందనకల్‌లో నూనె గింజల పరిశ్రమను ఏర్పాటు చేస్తామని తెలిపారు. సిరిసిల్ల మం డలం పెద్దూర్లోని 60 ఎకరాల్లో రూ.174 కోట్లతో అప్పారెల్ పార్క్ పనులు, 88 ఎకరాల్లో రూ.388 కోట్లతో వీవింగ్ పార్క్‌ల నిర్మాణం జరుగుతున్నదని పేర్కొన్నారు. రూ.4.50 కోట్లతో గోకుల్దాస్ ఇమేజెస్ పరిశ్రమ 950 మందికి ఉపాధి కల్పించిందని తెలిపా రు. అప్పారెల్ పార్క్ అందుబాటులోకి వస్తే 8 వేల మంది మహిళలకు ఉపాధి లభిస్తుందని వివరించారు.
సాగునీటి రంగంలో అద్భుతాలు
భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణాలతో తె లంగాణ సస్యశ్యామలంగా మారి దేశానికే అన్నం పె డుతున్నదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. శ్రీరాజరాజేశ్వర జలాశయం కేంద్రంగా రూ.2 వేల కోట్ల భా రీ పెట్టుబడితో 10 వేల మందికి ఉపాధినిచ్చేలా 366 ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద ఆక్వా హబ్ ఏర్పా టు చేస్తున్నట్టు తెలిపారు.
గ్రామాలు, పట్టణాలకు కేంద్రం అవార్డులు
తెలంగాణ చేపట్టిన పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కా ర్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయని కేటీఆర్ తెలిపా రు. కేంద్రం ఇస్తున్న జాతీయ అవార్డుల్లో అత్యధికం గా మన జిల్లాలు, గ్రామాలు దక్కించుకున్నాయని వివరించారు. కార్యక్రమంలో కలెక్టర్ అనురాగ్‌జయంతి, ఎస్పీ అఖిల్‌మహాజన్, అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, టీఎస్‌టీపీడీసీ చైర్మన్ ప్రవీణ్, జడ్పీ చైర్పర్సన్ అరు ణ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అలుపెరగని రామన్న
సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ శుక్రవారం 7 గంటలపాటు అలుపెరగకుండా పర్యటించారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ తెలంగా ణ దశాబ్ది వేడుకల్లో మమేకమయ్యారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన దేశాయిపల్లె యు వరైతు బాల్‌రెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. బాల్‌రెడ్డి భార్యకు జిల్లెల్లలోని వ్యవసా య కళాశాలలో ఉద్యోగం ఇప్పిస్తానని..ఆ వెంటనే ఫోన్లో కలెక్టర్‌తో మాట్లాడి.. జూన్ 5న ఆమెకు ఉ ద్యోగ నియామక పత్రం అందేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. బాల్‌రెడ్డి ఇద్దరు కుమార్తెల చదువులకు సాయం అందిస్తానని చెప్పారు. జిల్లెల్లకు చెందిన బాలిక అర్చనకు గురుకుల పాఠశాలలో ఇం టర్ అడ్మిషన్ ఇవ్వాలని అధికారులకు సూచించారు. అనంతరం కరీంనగర్లో తెలంగాణ దశాబ్ది వేడుకలకు హాజరుకావాలని మంత్రి గంగుల కమలాకర్ కోరడంతో.. ఈ నెల 17న వస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.
మండుటెండల్లో సైతం మత్తడి దుంకుతున్న చెరువులు, ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా రిజర్వాయర్లకు వెళ్తున్న నదీ జలాలు.. ఇవన్నీ సాగునీటి రంగంలో రాష్ట్రం సాధించిన అద్భుతాలు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు సాగునీటి రంగంలో తీరని అన్యాయం జరిగింది. నాడు రైతాంగం అప్పుల బాధలతో ఆత్మహత్యల పాలైంది. నేడు సాగునీటి రంగంలో స్వర్ణయుగాన్ని తలపిసున్నది.
నిలువెల్లా రైతు స్వభావాన్ని నింపుకున్న సీఎం కేసీఆర్ పాలనలో రైతుల కండ్లలో దీనత్వం తొలిగి, ధీరత్వం తొణికిసలాడుతున్నది. దుక్కి దున్నింది మొదలు పండిన ప్రతిగింజా కొనుగోలు చేసే దాకా అడుగడుగునా రైతన్నకు కొండంత అండగా ప్రభుత్వాన్ని నిలిపిన వ్యక్తి కేసీఆర్.
-మంత్రి కేటీఆర్
సింహగర్జనలోనే తెలంగాణ సాధిస్తామని చెప్పారు: కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): కేంద్రాన్ని దారికి తెచ్చి తెలంగాణను సాధిస్తామని 2001 మే 17న కరీంనగర్లో నిర్వహించిన సింహగర్జన సభలో కేసీఆర్ ప్రకటించారని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ‘పోరాట యో ధుడే పాలకుడై.. సాధించిన తెలంగాణను సగర్వంగా.. దేశంలో సమున్నతంగా నిలిపిన వేళ.. దశాబ్ది వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నది మన తెలంగాణ నేల. పదేండ్లలోనే వందేండ్ల ప్ర గతికి సజీవసాక్షిగా నిలిచిన తోబుట్టువులందరికీ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు.. జై తెలంగా ణ.. జై భారత్’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
ప్రగతికి మార్గదర్శిగా.. ;మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్ టౌన్, జూన్ 2: అమరవీరుల సాక్షిగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో పదేండ్లలోనే ప్రగతికి తెలంగాణ మార్గదర్శిగా నిలిచిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవదాయశాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ తల్లి, అమరవీరుల తాత్కాలిక స్థూపం వద్ద పూజలు నిర్వహించి, అమరవీరులకు నివాళి అర్పించారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసి మాట్లాడారు. రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తెలిపారు.
ఆదివాసుల అభివృద్ధికి..;మంత్రి సత్యవతి రాథోడ్
మహబూబాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): అభివృద్ధి చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో మహబూబాబాద్ మొదటి స్థానంలో ఉండేలా చర్యలు చేపడుతున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను శుక్రవారం మానుకోటలోని సమీకృత కార్యాలయాల సముదాయంలో ప్రారంభించారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం జిల్లా ప్రగతిని ప్రజలకు వివరించారు. ఆదివాసుల జీవన ప్రమాణాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని తెలిపారు.
మనది ప్రగతిశీల రాష్ట్రం;మంత్రి సబితాఇంద్రారెడ్డి
రంగారెడ్డి, జూన్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం అమరుల త్యాగఫలం, కేసీఆర్ పోరాట ఫలితం అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా రంగారెడ్డి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేసి, మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకున్నదని తెలిపారు.
అంతర్జాతీయ ప్రశంసలు: వేముల
తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది అని చెప్పుకునే స్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారకుడు సీఎం కేసీఆర్ అని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ అంతర్జాతీయ మన్ననలు పొందుతుండటానికి కేసీఆర్ శ్రమనే కారణమన్నారు.
అన్నింటా అభివృద్ధి: మహమూద్ అలీ
స్వల్పకాలంలోనే తెలంగాణ ప్రగతిశీల రాష్ట్రంగా ఎదిగిందని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించిన దశాబ్ది వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు.
తెలంగాణ సఫల రాష్ట్రం: మల్లారెడ్డి
తెలంగాణ సఫల రాష్ట్రం అని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు పొందుతుందున్నదన్నారు.
వచ్చే దశాబ్ద కాలానికి ప్రణాళికలు ; రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్ వినోద్ కుమార్
గత తొమ్మిదేండ్ల అనుభవాలతో రాబోయే పదేండ్లకు ప్రణాళికలు రూపొందించి తెలంగాణ రాష్ర్టాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని ప్రణాళికాసంఘం వైస్‌చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. తొమ్మిదేండ్లలోనే అభివృద్ధి, సంక్షేమంలో దేశం గర్వించే స్థాయికి తెలంగాణ చేరుకున్నదన్నారు.