Shikha Goyal | రాజస్థాన్‌లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్.. 27 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్
Shikha Goyal | రాజస్థాన్‌లో సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. జయపుర, నాగౌర్, జోధ్‌పూర్, సైబర్ సెక్యూరిటీ పోలీసుల సోదాలు నిర్వహించారు. దాదాపు 20 రోజులపాటు సెక్యూరిటీ పోలీసుల ఆపరేషన్ నిర్వహించింది.
Shikha Goyal | రాజస్థాన్‌లో సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. జయపుర, నాగౌర్, జోధ్‌పూర్, సైబర్ సెక్యూరిటీ పోలీసుల సోదాలు నిర్వహించారు. దాదాపు 20 రోజులపాటు సెక్యూరిటీ పోలీసుల ఆపరేషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా 27 మంది సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి భారీగా బ్యాంక్ చెక్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 31 బ్యాంక్ చెక్బుక్స్ని స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ సైబర్ ముఠాపై దేశవ్యాప్తంగా పలు సైబ్ నేరాలు నమోదయ్యాయి. తెలంగాణలో 189, దేశవ్యాప్తంగా 2,233 కేసులు రిజిస్టర్ అయ్యాయి.
29 నకిలీ ఖాతాల ద్వారా రూ.11.01కోట్లు ముఠా లూటీ చేసింది. నిందితుల నుంచి 31 సెల్ఫోన్లు, 37 సిమ్‌కార్డులు పోలీసుల బృందం స్వాధీనం చేసుకున్నది. 13 ఏటీఎం కార్డులు, ఏడు చెక్‌బుక్, రెండు హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నది. తెలంగాణలో 189 కేసుల్లో రాజస్థాన్ ముఠా రూ.9కోట్లు లూటీ చేసింది. పోలీసుల నిఘా పెరగడంతో నగరాలు వదిలి ముఠాలు గ్రామాల వైపు దృష్టి పెట్టాయి. మారుమూల గ్రామాల్లో ఉంటూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ శిఖా గోయల్ విలేకరుల సమావేశం నిర్వహించి.. సైబర్ నేరగాళ్ల అరెస్టుకు సంబంధించి వివరాలను వెల్లడించారు. అనుమానిత లింక్స్‌ని ఎవరూ క్లిక్ చేయొద్దు సూచించారు.
లింక్‌లపై అనుమానం ఉంటే పోలీసులను ఆశ్రయించాలన్నారు. దక్షిణ ఆసియా సైబర్ నేరాలకు హబ్‌లా మారాయని.. రాజస్థాన్ ముఠా రాష్ట్రంలో భారీగా నేరాలకు పాల్పడిందన్నారు. నిరుద్యోగులు, పేదలు, ప్రభుత్వ ఉద్యోగులు లక్ష్యంగా చేసుకుంటున్నారన్నారు. సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టిన రూ.114కోట్లను బాధితులకు తిరిగి ఇప్పించినట్లు తెలిపారు. సైబర్ నేరగాళ్లు మోసం చేస్తే వెంటనే కాల్ సెంటర్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇప్పటి వరకు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించలేదని.. స్పెషల్ ఆపరేషన్ కోసం ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. టెక్నికల్ అవెడిన్స్ ఆధారంగా నిందితులను పట్టుకోగలిగామన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఫోన్ చూడొద్దని తల్లి మందలించిందని మనస్తాపం.. ఇద్దరు పిల్లలను టీవీ ముందు కూర్చోబెట్టి వివాహిత ఆత్మహత్య
RC 17 | సుకుమార్ సినిమా కోసం రామ్ చరణ్ కొత్త లుక్.. బరువు తగ్గడం కోసం ప్రత్యేక శిక్షణ!
ఉప్పల్ భగాయత్‌లో ఘోర ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొని ఇద్దరు యువకులు మృతి
KTR | గూండాయిజంతోనే కంపెనీలను భారత్‌కు తీసుకొస్తారా.. రాహుల్ గాంధీని నిలదీసిన కేటీఆర్
HBA1C | 3 నెలల సగటు చక్కెర స్థాయిలను తెలిపే హెచ్‌బీఏ1సీ పరీక్ష నిజమైన ఫలితాలనే ఇస్తుందా..?
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

