హైదరాబాద్, జూన్ 9(నమస్తే తెలంగాణ) : మెల్బోర్న్లో తెలంగాణ కల్చరల్ దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. శనివారం మెల్బోర్న్ తెలంగాణ ఫోరం(ఎంటీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాలకు తెలుగు మాట్లాడేవారు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాకారులు తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింభించేవిధంగా ప్రదర్శనలు ఇచ్చారు. ముఖ్యంగా రామాయణం, శ్రీరాముడి నేపథ్యంతో కూడిన జానపద నృత్యాలు, సంగీత ప్రదర్శనలు, నాటక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకొన్నాయి.
ఈ సందర్భంగా ఎంటీఎఫ్ అధ్యక్షురాలు లక్ష్మీ నూకల మాట్లాడుతూ… తెలంగాణ సాంస్కృతిక దినోత్సవం కేవలం వారసత్వానికి సంబంధించినదే కాదని, మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవడంపట్ల మనకున్న నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు. కార్యక్రమంలో విక్టోరియన్ మల్టీకల్చరల్ కమ్యూనిటీ చైర్పర్సన్ వివియన్, మెల్బోర్న్లోని ఇండియన్ ఎంబసీ కాన్సుల్ జనరల్ డాక్టర్ సుశీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.