సోమవారం 28 సెప్టెంబర్ 2020
Telangana - Sep 03, 2020 , 16:13:51

అసెంబ్లీ స‌మావేశాల‌పై సీఎస్ సోమేశ్ కుమార్ స‌మీక్ష‌

అసెంబ్లీ స‌మావేశాల‌పై సీఎస్ సోమేశ్ కుమార్ స‌మీక్ష‌

హైద‌రాబాద్ : ఈ నెల 7వ తేదీ నుంచి అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేప‌థ్యంలో అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంది. అసెంబ్లీ స‌మావేశాల నేప‌థ్యంలో బీఆర్‌కే భ‌వ‌న్‌లో అన్ని శాఖ‌ల కార్య‌ద‌ర్శులు, ఉన్న‌తాధికారుల‌తో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. అన్ని శాఖ‌లు త‌మ‌కు సంబంధించిన స‌మ‌గ్ర స‌మాచారం త‌యారు చేయాలి. మండ‌లి, శాస‌న‌స‌భ‌లో పెండింగ్‌లో ఉన్న అన్ని ప్ర‌శ్న‌ల‌కు వెంట‌నే స‌మాధానాలు పంపాలి. అసెంబ్లీ అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుని ప‌ని చేయాల‌ని సీఎస్ సూచించారు. మండ‌లిలోనూ సీనియ‌ర్ అధికారులు ఉండేలా చూడాల‌న్నారు. స‌భ్యులు లేవ‌నెత్తే అంశాల‌కు సంబంధించిన నోట్స్‌ను సిద్ధం చేసుకోవాల‌ని సీఎస్ సోమేశ్ కుమార్‌ చెప్పారు.  


logo