Congress | హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీకి కేరళ రాష్ట్ర బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలిసింది. వచ్చే ఏడాది కేరళలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆమెకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా కొత్త వ్యక్తిని నియమించే అవకాశం ఉంది.
ఈ క్రమంలో ఏఐసీసీ పెద్దలు నలుగురి పేర్లను పరిశీలనలోకి తీసుకున్నట్టు సమాచారం. వారిలో భూపేశ్ భగేల్, సచిన్ పైలట్, మీనాక్షి నటరాజన్, అశోక్ గెహ్లాట్ ఉన్నట్టు తెలిసింది. వీరిలో ఒకరి నియామకంపై అతి త్వరలోనే ఏఐసీసీ నుంచి కీలక ప్రకటన వెలువడనుంది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా దీపాదాస్ మున్షీ 2023 డిసెంబర్ 23న బాధ్యతలు చేపట్టారు.