రూ.45.67 కోట్ల జీఎస్టీ టోకరా
బోగస్ కంపెనీలను సృష్టించి రూ.45.67 కోట్ల మేరకు జీఎస్టీ రీఫండ్ పొంది భారీ మోసానికి పాల్పడ్డ ఓ ముఠా గుట్టును తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ రట్టు చేసింది. నిందితుల్లో ఒకరిని అరెస్టు చేసి, కోర్టు ఎదుటు హాజరుపరిచింది. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ డాక్టర్ టీకే శ్రీదేవి తెలిపిన వివరాల ప్రకారం.. ఎలక్ట్రిక్ బైక్‌లకు సంబంధించి జీఎస్టీ రీఫండ్‌ను కాజేయాలనే దురుద్దేశంతో ఏడుగురు నిందితులు ముఠాగా ఏర్పడ్డారు.
- బోగస్ కంపెనీల పేరిట భారీ మోసం
- ఏడుగురు నిందితుల్లో ఒకరు అరెస్టు
హైదరాబాద్, అక్టోబర్11 (నమస్తే తెలంగాణ): బోగస్ కంపెనీలను సృష్టించి రూ.45.67 కోట్ల మేరకు జీఎస్టీ రీఫండ్ పొంది భారీ మోసానికి పాల్పడ్డ ఓ ముఠా గుట్టును తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ రట్టు చేసింది. నిందితుల్లో ఒకరిని అరెస్టు చేసి, కోర్టు ఎదుటు హాజరుపరిచింది. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ డాక్టర్ టీకే శ్రీదేవి తెలిపిన వివరాల ప్రకారం.. ఎలక్ట్రిక్ బైక్‌లకు సంబంధించి జీఎస్టీ రీఫండ్‌ను కాజేయాలనే దురుద్దేశంతో ఏడుగురు నిందితులు ముఠాగా ఏర్పడ్డారు.
శివసాయి ఎంటర్ప్రైజేస్, మాగ్నమ్, యోక, అపెక్స్, గ్రోమోర్, సుప్రియా ఎలక్ట్రిక్ బైక్స్, వినరాడ్ ఆటోమొబైల్స్ పేరిట మొత్తం 7 బోగస్ కంపెనీలను సృష్టించారు. ఢిల్లీ కేంద్రంగా ఆయా కంపెనీలను రిజిస్ట్రర్ చేశారు. అక్కడి నుంచి ఎలక్ట్రిక్ బైక్‌ల విడిభాగాలను కొనుగోలు చేస్తున్నట్టుగా, తెలంగాణలోవాటిని విక్రయిస్తున్నట్టు చూపి మొత్తం రూ.45.67 కోట్లను కాజేశారు. ఈ వ్యవహారంపై అనుమానంతో రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ టీకే శ్రీదేవి నేతృత్వంలో అధికారులు విచారణ చేపట్టారు. కంపెనీలు లేవని, విడిభాగాల కొనుగోళ్లు, బైక్‌ల అమ్మకాలు అంతా బోగస్ అని తేల్చారు. ఇందులో కీలకంగా వ్యవహరించిన నిందితుడు వేమిరెడ్డి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచినట్టు కమిషనర్ శ్రీదేవి వెల్లడించారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

