CM Revant Reddy | కేంద్ర ప్రభుత్వ రంగ పథకం సర్వశిక్షా అభియాన్ లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులైజ్ చేయలేమని సీఎం ఏ రేవంత్ రెడ్డి తెగేసి చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా వారిని రెగ్యులరైజ్ చేస్తే న్యాయస్థానాల్లో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. శుక్రవారం సర్వశిక్షా అభియాన్ ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులతో ఆయన సమావేశం అయ్యారు. వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని స్పష్టం చేశారు. అవకాశం లేకున్నా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని పట్టుబడితే సమస్య పెరుగుతుందే తప్ప పరిష్కారం కాదన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తమ సమస్యలు చెబితే పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు.