హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నానని కేసీఆర్ లేఖ ద్వారా తెలిపారు.
దేశానికి సేవ చేయడానికి దేవుడు ఆయురోగ్యాలను, దీర్ఘాయుషును ప్రసాదించాలని ఆకాంక్షించారు.