హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి చెందిన ఇద్దరు నర్సులు సోమవారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులు అందుకున్నారు. 2020 సంవత్సరానికి అరుణకుమారి, మహ్మద్ సుక్రాను ఈ అవార్డులు వరించాయి. అరుణకుమారి హైదరాబాద్‌లోని అఫ్జల్‌సాగర్ యూపీహెచ్‌సీలో మల్టీపర్ప స్ హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. సుక్రా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం కేశవాపూర్‌లో ఏఎన్ఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు. కరోనా కాలం లో వీరు అందించిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాలు దక్కాయి. ఏపీ నుంచి అవార్డుకు ఎంపికైన డీ రూపకళ సైతం తెలంగాణ బిడ్డే. ఖమ్మం జిల్లాకు చెందిన ఆమె ప్రస్తుతం ఏపీలోని శ్రీహరికోటలో పనిచేస్తున్నారు.