హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రేవంత్ సర్కారు చేపట్టిన కుల సర్వే.. కేంద్రం చేపట్టనున్న కులగణనకు రోల్ మోడల్ కాదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి స్పష్టంచేశారు. ఆదివారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జనగణలో భాగంగా కులాల లెక్కలు తీసి కేంద్రం చట్టబద్ధత కల్పించనున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా కులగణన గురించి పార్టీ నాయకులకు వివరించారు. ఈ అంశంపై విస్త్రృత ప్రచారం నిర్వహించాలని, పది ఉమ్మడి జిల్లాల్లో కుల సంఘాల నాయకులతో సమావేశాలు నిర్వహించి కులగణనపై అవగాహన కల్పించాలని కిషన్రెడ్డి సూచించారు.‘