హైదరాబాద్ : ఈ నెల 12వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో ఈ సమావేశం జరగనుంది. కేబినెట్ సమావేశానికి మంత్రులందరూ హాజరు కానున్నారు. కేబినెట్ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు.