e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home News తెలంగాణ‌ రాష్ర్ట మంత్రివ‌ర్గ స‌మావేశం ప్రారంభం

తెలంగాణ‌ రాష్ర్ట మంత్రివ‌ర్గ స‌మావేశం ప్రారంభం

తెలంగాణ‌ రాష్ర్ట మంత్రివ‌ర్గ స‌మావేశం ప్రారంభం

హైదరాబాద్ : ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న రాష్ర్ట మంత్రివ‌ర్గ స‌మావేశం ప్రారంభ‌మైంది. ఈ స‌మావేశానికి మంత్రులంద‌రూ హాజ‌ర‌య్యారు. ఉద్యోగ నియామకాలు, కృష్ణా జల వివాదాల అంశాల‌తో పాటు ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చిస్తున్నారు. వీలైనంత త్వరలో 50వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించారు.

ముఖ్యంగా సీమ ఎత్తిపోతలను అడ్డుకొనేందుకు ఎలాంటి పద్ధతులు అనుసరించాలన్న దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. కరోనా కారణంగా పడిపోయిన ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులోభాగంగా భూముల విలువను సవరించాలనే ఆలోచనకు వచ్చింది. దీనిపై ఏర్పాటుచేసిన క్యాబినెట్‌ సబ్‌కమిటీ చేసిన ప్రతిపాదనలపై చర్చించి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ కరోనా థర్డ్‌వేవ్‌ వస్తే ఎదుర్కోవడానికి సంసిద్ధతపై చర్చించనున్నది. వానకాలం సీజన్‌ ప్రారంభమైన నేపథ్యంలో విత్తనాలు, ఎరువులు ఎంతమేరకు సిద్ధంగా ఉన్నాయి, కల్తీ విత్తనాల నిరోధానికి తీసుకుంటున్న చర్యలపై చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటారు. జూలై 1నుంచి 10వ తేదీ వరకు జరిగిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై సమీక్షిస్తారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తెలంగాణ‌ రాష్ర్ట మంత్రివ‌ర్గ స‌మావేశం ప్రారంభం
తెలంగాణ‌ రాష్ర్ట మంత్రివ‌ర్గ స‌మావేశం ప్రారంభం
తెలంగాణ‌ రాష్ర్ట మంత్రివ‌ర్గ స‌మావేశం ప్రారంభం

ట్రెండింగ్‌

Advertisement