హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): భారీగా పెరుగుతున్న డీజీల్ ధరలు టీఎస్ ఆర్టీసీకి పెను భారంగా మారాయని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భారాన్ని కొంత మేర తగ్గించుకొనేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో డీజిల్ సెస్ విధించాలని నిర్ణయించామని, శనివారం నుంచి ఇది అమల్లోకి వస్తుందని శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకొని ఆర్టీసీకి సహకరించాలని ప్రయాణికులను కోరారు. టీఎస్ ఆర్టీసీ రోజూ 6 లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తున్నదని, 2021 డిసెంబర్లో లీటర్ రూ.85గా ఉన్న హైస్పీడ్ డీజిల్ ధర.. ప్రస్తుతం రూ.118కి ఎగబాకిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ భారాన్ని ఎలాగోలా మోస్తూ వచ్చామని, అయినా ఇంధన ధరల పెరుగుదల కొనసాగుతుండటంతో డీజిల్ సెస్ విధించాల్సి వస్తున్నదని వివరించారు. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో రూ.10 కనీస చార్జీ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఆర్టీసీలో 12 స్లీపర్ బస్సులు
ఆర్టీసీలో త్వరలో స్లీపర్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. తొలి విడత 12 బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ నిర్ణయించింది. ఆరు గంటలకుపైగా ప్రయాణ సమయం, 250 కిలో మీటర్లకుపైగా దూర ప్రాంతాలకు ఈ బస్సులు నడుపనున్నారు. షిరిడీ, తిరుపతి, బెంగళూరు, పుణె, విజయవాడ, విశాఖప ట్నం, ముంబై రూట్లలో వీటిని నడపాలని నిర్ణయించారు. స్లీపర్ బ స్సులు సహా మొత్తం 500 కొత్త బస్సుల కొ నుగోలుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. వీటి లో నాన్ ఏసీ బస్సు రూ.35 లక్షలు, ఏసీ బస్సు రూ.55 లక్షల ధర ఉంటుందని వెల్లడించారు. బ్యాంకుల నుంచి రుణం తీసుకొని త్వరలో కొనుగోలు చేస్తామని తెలిపారు.
రామనవమికి 350 ప్రత్యేక బస్సులు
సుల్తాన్‌బజార్, ఏప్రిల్ 8: శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఈ నెల 9 నుంచి 11 వరకు భద్రాచలానికి 350 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు టీఎస్ ఆర్టీసీ హైదరాబాద్ ఈడీ పురుషోత్తంనాయక్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 9, 10 తేదీల్లో హైదరాబాద్ నుంచి రోజుకు 70 చొప్పున బస్సులు భద్రాచలం వెళ్తాయని చెప్పారు. 10న భద్రాచలం నుంచి హైదరాబాద్‌కు 70 బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. 9, 10 తేదీల్లో ఖమ్మం నుంచి భద్రాచలానికి 40 బస్సులు, పర్ణశాల నుంచి 30, కొత్తగూడెం నుంచి 40, మధిర నుంచి 10, మణుగూరు నుంచి 15, సత్తుపల్లి నుంచి 10, కరీంనగర్ నుంచి 15, నల్లగొండ నుంచి 15, వరంగల్ నుంచి 15, విజయవాడ నుంచి 20 బస్సులు నడుపుతున్నట్టు ఆయన వివరించారు. కొత్తగూడెం రైల్వేస్టేషన్ నుంచి కూడా బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్టు చెప్పారు. ప్రయాణికులు ఆర్టీసీ కౌంటర్లతోపాటు ఏటీబీ ఏజెంట్ పాయింట్ల వద్ద, www.tsrtconline.in వెబ్సైట్లో ఆన్లైన్లో కూడా టికెట్లు పొందవచ్చని సూచించారు.
మద్యం తాగిన డ్రైవర్‌పై చర్యలు
హైదరాబాద్-2 డిపోకు చెందిన అద్దె బస్సు డ్రైవర్ మద్యం సేవించిన వ్యవహారంలో సంబంధిత అద్దె బస్సు కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. సూర్యాపేట జిల్లా తొర్రూర్‌కు 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న అద్దె బస్సు డ్రైవర్ దారిలో బస్సును ఆపి, మద్యం సేవించిన ఘటనపై ఆయన సీరియస్‌గా స్పందించారు. ఆ డ్రైవర్ భవిష్యత్తులో మరే బస్సు నడపకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ డ్రైవర్లు మద్యం సేవించి విధులకు హాజరైతే కఠినచర్యలు తప్పవని, ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. ఆర్టీసీ డ్రైవర్లకు ప్రతిరోజూ ఆయా డిపోల్లో అత్యాధునిక బ్రీత్ ఎనలైజర్లతో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
డీజిల్ సెస్ ఇలా..