Telangana Budget | హైదరాబాద్ : 2025-26 వార్షిక బడ్జెట్ను (Telangana Budget) ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసన సభలో ప్రవేశపెట్టారు. రూ.3,04,965 కోట్లతో బడ్జెట్ను ప్రతిపాదించారు. రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా పేర్కొన్నారు. ఇక అత్యధికంగా ఎస్సీ సంక్షేమానికి రూ. 40,232 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత వ్యవసాయ శాఖకు రూ. 24,439 కోట్లు, నీటి పారుదల రంగానికి రూ. 23,373 కోట్లు కేటాయించారు.
తెలంగాణ బడ్జెట్ 2025-26 3,04,965 కోట్లు..
రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్లు..
మూలధన వ్యయం 36,504 కోట్లు..
వ్యవసాయ శాఖ 24,439 కోట్లు కేటాయింపు..
పశు సంవర్దక శాఖ కు 1,674 కోట్లు కేటాయింపు..
పౌరసరఫరాల శాఖ కు 5,734 కోట్లు కేటాయింపు..
విద్యాశాఖకు 23,108 కోట్లు కేటాయింపు..
మహిళా, శిశు సంక్షేమానికి 2,862 కోట్లు కేటాయింపు..
ఎస్సీ సంక్షేమానికి 40,232 కోట్లు కేటాయింపు..
ఎస్టి సంక్షేమానికి 17,169 కోట్లు కేటాయింపు..
బీసీ సంక్షేమానికి 11,405 కోట్లు కేటాయింపు..
మైనారిటీ సంక్షేమానికి 3,591 కోట్లు కేటాయింపు..
ఐటీ శాఖకు 7,704 కోట్లు..
వైద్య ఆరోగ్యశాఖకు 12,393 కోట్లు కేటాయింపు..
విద్యుత్ శాఖకు 21,221 కోట్లు కేటాయింపు..
హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్కి 150 కోట్లు కేటాయింపు..
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖకు 17,677 కోట్లు కేటాయింపు..
నీటి పారుదుల శాఖకు 23,373 కోట్లు కేటాయింపు..
రోడ్లు భవనాల శాఖకు 5,907 కోట్లు కేటాయింపు..
పర్యాటకశాఖ కు 775 కోట్లు కేటాయింపు..
క్రీడా శాఖకు 465 కోట్లు కేటాయింపు..
ఫారెస్ట్ స్టాండ్ ఎన్విరాన్మెంట్ 1,023 కోట్లు కేటాయింపు..
దేవాదాయశాఖ కు 190 కోట్లు కేటాయింపు..
హోంశాఖ కు 10,188 కోట్లు కేటాయింపు..