హైదరాబాద్ : రూ. 2,56,958.51 కోట్లతో హరీశ్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ. 1.89 లక్షల కోట్లు కాగా, క్యాపిటల్ వ్యయం రూ. 29,728 కోట్లు. రాష్ట్రం ఆవిర్భవించిన అనతికాలంలో అద్భుత ప్రగతి సాధించామని హరీశ్‌రావు తెలిపారు. సీఎం ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ ప్రగతి పథంలో రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారు. పరిపాలనలో రాజీలేని వైఖరిని టీఆర్ఎస్ అవలంభించింది. కరెంట్ కోతలు, ఆకలి చావులు ఇప్పుడు లేవు అని స్పష్టం చేశారు.
2022-23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ రూ. 2.56 లక్షల కోట్లు
రెవెన్యూ వ్యయం రూ. 1.89 లక్షల కోట్లు
క్యాపిటల్ వ్యయం రూ. 29,728 కోట్లు.
పన్ను ఆదాయం రూ. 1,08,212 కోట్లు
కేంద్ర పన్నుల్లో వాటా రూ. 18,394 కోట్లు
పన్నేతర ఆదాయం రూ. 25,421 కోట్లు
గ్రాంట్లు రూ. 41,001 కోట్లు
రుణాలు రూ. 53,970 కోట్లు
అమ్మకం పన్ను అంచనా రూ. 33 వేల కోట్లు
ఎక్సైజ్ ద్వారా ఆదాయం రూ. 17,500 కోట్లు
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం రూ. 15,600 కోట్లు
ఆర్టీసీ బలోపేతానికి రూ. 1500 కోట్లు
పోలీసు శాఖకు రూ. 9,315 కోట్లు
కాళేశ్వరం సర్క్యూట్లో టూరిజం అభివృద్ధి కోసం రూ. 1500 కోట్లు
రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, నిర్వహణ కోసం రూ. 1542 కోట్లు
పరిశ్రమలకు ప్రోత్సాహకాలుగా రూ. 2,142 కోట్లు
పరిశ్రమలకు విద్యుత్ రాయితీల కింద రూ. 190 కోట్లు
పావలా వడ్డీ పథకానికి రూ. 187 కోట్లు
విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యం..
మహిళా విశ్వవిద్యాలయానికి రూ. 100 కోట్లు
కొత్త వైద్య కాలేజీలకు రూ. 1000 కోట్లు
అటవీ విశ్వవిద్యాలయాలకు రూ. 100 కోట్లు
మన ఊరు – మన బడి పథకానికి రూ. 3,497 కోట్లు
వచ్చే ఆర్థిక సంవత్సరం ఏడాది రూ. 75 వేల లోపు సాగు రుణాలు మాఫీ
రూ. 50 వేల లోపు రైతు రుణాలు మార్చి లోపు మాఫీ
పంట రుణాలు మొత్తం రూ. 16,144 కోట్లు మాఫీ
ఈ దఫా 5.12 లక్షల మంది రైతులకు రుణాలు మాఫీ
వ్యవసాయ రంగానికి రూ. 24,254 కోట్లు
పామాయిల్ సాగుకు రూ. 1000 కోట్లు
రాష్ట్రంలో 2.5 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యం.
ఆసరా పెన్షన్లకు రూ. 11,728 కోట్లు
సడలించిన వయోపరిమితి ప్రకారం కొత్త లబ్ధిదారులకు ఆసరా పెన్షన్లు
దళితబంధుకు రూ. 17,700 కోట్లు
ఎస్టీల సంక్షేమం కోసం రూ. 12,565 కోట్లు
బీసీల సంక్షేమం కోసం రూ. 5,698 కోట్లు
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు రూ. 2,750 కోట్లు
బ్రాహ్మణుల సంక్షేమం కోసం రూ. 177 కోట్లు
దూప దీప నైవేద్య పథకానికి రూ. 12.50 కోట్లు
సొంత స్థలంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం
సొంత స్థలాల్లో ఇండ్ల నిర్మాణానికి రూ. 3 లక్షల ఆర్థిక సాయం(4 లక్షల మందికి)
నియోజకవర్గానికి 3 వేల ఇండ్లు కేటాయింపు
ఎమ్మెల్యేల పరిధిలో 3.57 లక్షల ఇండ్లు కేటాయింపు
నిర్వాసితులు, ప్రమాద బాధితులకు 43 వేల ఇండ్లు కేటాయింపు
డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి రూ. 12 వేల కోట్లు
పల్లె ప్రగతికి రూ. 3330 కోట్లు
పట్టణ ప్రగతికి రూ. 1394 కోట్లు
హరితహారానికి రూ. 932 కోట్లు
హైదరాబాద్ మెట్రో పరిధిలో రోజుకు 20 లీటర్ల ఉచిత నీటి పథకానికి రూ. 300 కోట్లు
పాతబస్తీలో మెట్రో రైలు కోసం రూ. 500 కోట్లు
అర్బన్ మిషన్ భగీరథకు రూ. 800 కోట్లు
ఎయిర్‌పోర్టు మెట్రో అనుసంధానానికి రూ. 500 కోట్లు
హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్‌కు రూ. 1500 కోట్లు
హైదరాబాద్, ఓఆర్ఆర్ చుట్టు ఉన్న గ్రామాలు, మున్సిపాలిటీల్లో నీటి కొరతను తీర్చేందుకు రూ. 1200 కోట్లు