హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): జాగరణ దీక్ష పేరుతో డ్రామాకు తెరలేపి కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్కు హైకోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. ఇకపై ఎలాంటి రాజకీయ, నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నా కొవిడ్ మార్గదర్శకాలను, నిబంధనలు పాటించాల్సిందేనని ఆయనకు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది.