హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): ఆరోగ్య రంగంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉన్నదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్-4పై లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వైద్యారోగ్య రంగం పనితీరును విశ్లేషిస్తూ నీతి ఆయోగ్ గతేడాది డిసెంబర్ 27న 4వ హెల్త్ ఇండెక్స్‌ను విడుదల చేసిందని చెప్పింది. శాంపిల్ రిజిస్ట్రేషన్, సివిల్ రిజిస్ట్రేషన్, హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ వంటి 24 అంశాలను పరిగణనలోకి తీసుకొని సమాచారాన్ని సేకరించిందని పేర్కొన్నది. 2019-20లో పనితీరు (ఒవరాల్ పర్ఫార్మెన్స్)ను, 2018-19తో పోల్చి పురోగతిని (ఇంక్రిమెంటల్ పర్ఫార్మెన్స్) గణించి పాయింట్లు ఇచ్చినట్టు వెల్లడించింది. పెద్ద రాష్ర్టాల క్యాటగిరీలో తెలంగాణ ఒవరాల్ పర్ఫార్మెన్స్, ఇంక్రిమెంటల్ పర్ఫార్మెన్స్ విభాగాల్లో మూడో స్థానంలో నిలిచినట్టు స్పష్టం చేసింది.
తెలంగాణ ముందువరుసలో నిలిచిన అంశాలు..