హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తేతెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి అండతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆర్థిక అరాచకవాదిగా మారి రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడని బీఆర్ఎస్ నేత గట్టు రాంచందర్‌రావు ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గోడగడియారాలు పంచి పెట్టి ఓట్లు కొల్లగొట్టిన ఆయన, గద్దెనెక్కిన తర్వాత రాష్ట్ర ఖజానాను లూటీ చేస్తున్నాడని ధ్వజమెత్తారు. సోమవారం తెలంగాణ భవన్లో విలేకరులతో గట్టు మాట్లాడుతూ.. పొంగులేటి ఊకదంపుడు ఉపన్యాసాలు మాని, మాజీ మంత్రి హరీశ్‌రావు సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కేసీఆర్ కాళ్లుపట్టుకున్న వ్యక్తి, ఇప్పుడు సుద్దులు చెప్పడం దుర్మార్గమన్నారు. కేటీఆర్‌పై పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ అనుచిత వ్యాఖ్యలు సిగ్గుచేటని కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగేందర్‌గౌడ్ ఖండించారు. కండ్లు నెత్తికెక్కి సోయిలేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.