Telangana | కంపల్సరీ కేసీఆర్ను గెలిపించుకుంటామని ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. కారుకే మా ఓటు అని తేల్చచెబుతున్నారు. కేసీఆర్ పరిపాలనలోనే ఆటో డ్రైవర్లకు ఎంతో మేలు జరిగిందని, సంపాదించిన డబ్బులతో కుటుంబంతో సంతోషంగా ఉంటున్నామని తెలిపారు. హైదరాబాద్ నగరం ఎంతో అభివృద్ధి చెందిందని, పర్యాటకంగా తీర్చిదిద్దడంతో, తమకు ఉపాధి దొరికిందని ఆటో డ్రైవర్లు పేర్కొన్నారు.
ఆటో డ్రైవర్లకు యూనియన్ కార్డులు ఇచ్చారు. 5 లక్షల బీమా కల్పించారు. కాంగ్రెస్ గవర్నమెంట్లో బీమా లేదు. ఇప్పుడు రోడ్ ట్యాక్స్ మాఫీ చేశారు. మళ్లీ ప్రభుత్వం ఏర్పడగానే ఫిట్నెస్ ట్యాక్స్ రద్దు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. తొమ్మిదేండ్ల పాలనలో ఆటో డ్రైవర్లకు ఎంతో మంచి చేశారు. కేసీఆర్ను గెలిపించుకుంటాం. ఇప్పుడు ఆటో డ్రైవర్లకు ఎలాంటి ఇబ్బంది లేదు.
ఇప్పుడు ఆటో డ్రైవర్లకు పోలీసోళ్లతో బాధలేదు. గతంలో పోలీసోళ్లు ఇబ్బందులు పెట్టేవారు. రోజు కష్టపడితే వచ్చే ఆదాయం పోలీసోళ్లకే అప్పజెప్పేది. రాష్ట్రం మొత్తంలో కూడా బీఆర్ఎస్ పాలన బాగుంది. కారు గుర్తుకే ఓటేస్తాం. కేసీఆర్ అభివృద్ధి బాగుంది. మళ్లీ ఆయననే రావాలి. రోడ్లు బాగా వేశారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేశారు. కేసీఆర్ పాలన బాగుంది. సార్ చాలా మంచి వ్యక్తి. తప్పకుండా ఆయననే గెలిపించుకుంటాం.
కేసీఆర్ ప్రభుత్వంలో అంత మంచిగనే జరుగుతుంది. రైతుబంధు, రైతుబీమా, పెన్షన్లు బాగున్నాయి. రోడ్లు అభివృద్ధి చేశారు. సచివాలయాన్ని ఎంతో బాగా కట్టారు. అలా మంచి పనులు చేశారు. కేసీఆర్ను గెలిపించుకుంటే మరింత అభివృద్ధి జరుగుతది. కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ను గెలిపించుకుంటాం. హైదరాబాద్ పర్యాటకంగా ఎంతో అభివృద్ధి జరిగింది. దాంతో మాకు ఉపాధి దొరకుతుంది.
కరెంట్ కొరత, నీటి కొరత లేదు. మంచి వైద్య సదుపాయాలు కల్పించారు. అన్నీ బాగున్నాయి. రాష్ట్రంలో ఎలాంటి కర్ఫ్యూ, అల్లకల్లోలాలు లేవు. ప్రస్తుతం రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కర్ఫ్యూ, కల్లోలాలు ఉండే. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. బీఆర్ఎస్ పాలనలో ఇంకా అభివృద్ధి జరుగతదని ఆశపడుతున్నాం. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను నమ్మే పరిస్థితి లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే కదా.. ఆరు గ్యారెంటీలు ఇచ్చేది. కాంగ్రెస్ రాజ్యంలో అన్ని బాధలే. ఇప్పుడు ఆ బాధలు లేవు. మా ఓటు పక్కా బీఆర్ఎస్కే అని ఆటో డ్రైవర్లు తెలిపారు.