హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 23న ప్రారంభంకానున్నాయి. దాదాపు 10 రోజులపాటు ఈ సమావేశాలు కొనసాగుతాయి. 25 లేదా 26న బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. రెవెన్యూ శాఖకు సంబంధించి ‘రికార్డ్ ఆఫ్ రైట్స్'(ఆర్వోఆర్) బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం.
సీఎం రేవంత్‌రెడ్డి వచ్చే నెల 3 నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 10 రోజులు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. కంటోన్మెట్ శాసనసభ్యురాలిగా ఉన్న సమయంలో మరణించిన లాస్య నందితకు సభ సంతాపం తెలుపనుంది.
వాలంతరి డీజీగా కృష్ణారెడ్డి
హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): నీటిపారుదలశాఖ ఎస్ఈ బీవీ కృష్ణారెడ్డిని వాలంతరి డీజీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇరిగేషన్‌శాఖ సర్కిల్-2లో ఎస్ఈ శివకుమార్‌ను మంచిర్యాల సీఈగా నియమిస్తూ గురువారం ప్రభుత్వ కార్యదర్శి రాహుల్ బొజ్జ ఉత్తర్వులు జారీచేశారు.