హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ నెల 9న ప్రారంభమైన అసెంబ్లీ, 21 సాయంత్రం 7.30 గంటల వరకు కొనసాగింది. మొత్తం ఆరు రోజుల్లో 26 గంటల 33 నిమిషాలపాటు సమావేశాలు జరిగినట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు.