హైదరాబాద్ : శాసన సభ నిరవధికంగా వాయిదా పడింది. ఈ నెల 6న శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగా.. మూడు రోజుల పాటు కొనసాగాయి. ఈ నెల 6న సమావేశాలు ప్రారంభం కాగా.. తొలి రోజు మాజీ ఎమ్మెల్యేలు మల్లు స్వరాజ్యం, పరిపాటి జనార్ధన్‌కు సంతాపం అనంతరం సభ వాయిదాపడింది. సోమవారం, మంగళవారాల్లో సభలు కొనసాగాయి. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం శాసన సభలో ఎనిమిది బిల్లులను సభలో ప్రవేశపెట్టగా.. సభ ఆమోదం తెలిపింది. విభజన చట్టం హామీల అమలులో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం, ఎఫ్ఆర్బీఎం చట్టంలో కేంద్ర ప్రభుత్వ ద్వంద వైఖరి, రాష్ట్ర ప్రగతిపై దాని ప్రభావంపై తదితర అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్రం ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద వైఖరిపై మంత్రులు విరుచుకుపడ్డారు. అనంతరం శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిరవధికంగా వాయిదా వేశారు.