TTA | హైదరాబాద్: తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) ‘సేవాడేస్’ పేరుతో పెద్ద ఎత్తున సామాజిక కార్యక్రమాలు నిర్వహించనున్నది. ఈ టీటీఏ సేవాడేస్ 2025 డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 23 వరకు తెలంగాణ జిల్లాల్లో కొనసాగనుననాయి. ఈ నెల 14న గచ్చిబౌలిలో ‘10కే రన్’తో డ్రగ్స్‌పై భారీ స్థాయిలో అవగాహన కార్యక్రమం జరుగనున్నది. 25న టీటీఏ 10వ వార్షికోత్సవ వేడుకలు చేపడుతారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో టీటీఏ నాయకులు ‘టీటీఏ సేవాడేస్ 2025’ వివరాలు ప్రకటించి, కార్యక్రమాల గురించి వివరించారు. సేవాడేస్‌లో భాగంగా ఆరోగ్యం, విద్య, సమాజ అభివృద్ధి, యువత అవగాహనా కార్యక్రమాలు, మాదకద్రవ్యాల నివారణపై చైతన్యం, రక్తదానం, ఆహార పంపిణీ, గిరిజన ప్రాంతాలకు మద్దతు తదితర 40పైగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
కార్యక్రమాలు హైదరాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, జనగామ, నల్లగొండ, యాదాద్రితో పాటు పలు జిల్లాల్లో జరుగుతాయన్నారు. ఫౌండర్ పైల మల్లారెడ్డి, ప్రెసిడెంట్ నవీన్ మల్లిపెద్ది, ఏసీ చైర్ విజయపాల్ రెడ్డి, ఏసీ కో చైర్ మోహన్ రెడ్డి పటలోళ్ల, సేవాడేస్ సలహాదారు డాక్టర్ ద్వారకానాథ్ రెడ్డి, టీటీ కన్వెన్షన్ 2026 చైర్ ప్రవీణ్ చింతా, 10వ వార్షికోత్సవ చైర్ డీఎల్ఎన్ రెడ్డి, జాయింట్ ట్రెజరర్ స్వాతి చెన్నూరి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ – ఇంటర్నేషనల్ సర్వీసెస్ డైరెక్టర్ జ్యోతి రెడ్డి దూదిపాల, ఎక్స్ బీవోడీ రమా కుమారి వనమా, అంతర్జాతీయ వీపీ నర్సింహ పెరుక, సేవాడేస్ కోఆర్డినేటర్ విశ్వ కంది, 10వ వార్షికోత్సవ వేడుక కల్చరల్ చైర్ డా వాణి గడ్డం, అమెరికాకు చెందిన టీటీ నేతలు, రాష్ట్ర ప్రతినిధులు, వలంటీర్లు పాల్గొంటారన్నారు.
25న వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తామన్నారు. పదేళ్లుగా తెలంగాణతో తమ బంధం మరింత బలపడుతోందని టీటీఏ నాయకులు తెలిపారు. సేవాడేస్‌లో భాగంగా డిసెంబర్ 14న గచ్చిబౌలిలో సే నో టూ డ్రగ్స్ సందేశంతో 10కే రన్ జరుగుతుందన్నారు. ఈ రన్లో విద్యార్థులు, యువత, స్పోర్ట్స్ కమ్యూనిటీ, వలంటీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. ఫిట్నెస్ను ప్రోత్సహించడంతో పాటు డ్రగ్స్ అవగాహన కల్పించడమే కార్యక్రమం లక్ష్యమన్నారు.