హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అనుభవం గల గ్రూప్-1 అధికారులతో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని గ్రూప్-1 ఆఫీసర్ల అసోసియేషన్ అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి హన్మంత్ నాయక్ కోరారు.
ఈ మేరకు గురువారం హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పంచాయత్ రాజ్, మున్సిపల్ శాఖల గ్రూప్-1 అధికారులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లుగా నియమించాలని విజ్ఞప్తి చేశారు. సీఎంను కలిసిన వారిలో శశికిరణా చారి, అరవింద్ రెడ్డి, నూతనకంటి వెంకట్, పద్మావతి, భరత్ రెడ్డి, ప్రశాంతి, మాధవ్, ఫణి గోపాల్, వినోద్, సోమ శేఖర్ తదితరులు ఉన్నారు.