హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 724 బడుల్లో తెలంగాణ అచీవర్స్ ప్రోగ్రామ్ పేరుతో శిక్షణ ఇవ్వనున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఈ నవీన్ నికోలస్ తెలిపారు. 194 మాడల్ స్కూళ్లు, 495 కేజీబీవీలు, 35 తెలంగాణ గురుకులాల్లో శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ఫిజిక్స్‌వాలా లిమిటెడ్ సహకారంతో 15 నుంచి డిసెంబర్ 31వరకు ఆన్లైన్లో ఐఐటీ జేఈఈ, నీట్, ఎప్‌సెట్, క్లాట్ శిక్షణ ఇస్తామని తెలిపారు. 9, 10 తరగతులకు ఫౌండేషన్ ప్రోగ్రామ్ ద్వారా ఇంటర్ విద్యార్థులకు శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు.
ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించొద్దు: టీఎన్జీవో
హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించవద్దని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం(టీఎన్జీవో) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సీఎస్ రామకృష్ణారావు, సీఎంవో కార్యదర్శి శేషాద్రిని కలిసి వినతిపత్రం సమర్పించింది.