లంచం అడిగితే 1064కు ఫిర్యాదు చేయండి: ఏసీబీ
ఎవరైనా లంచం అడిగితే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీఎస్పీలు శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మీకాంత్‌రెడ్డి, చలపతి, రాజేశ్ సూచించారు. ‘విజిలెన్స్ అవగాహన వారోత్సవం-2026’లో భాగంగా బుధవారం హైదరాబాద్ రవాణా కమిషనర్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ అవినీతిని రూపుమాపడం ఉద్యోగులతోపాటు ప్రతిపౌరుడి బాధ్యత అని స్పష్టంచేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): ఎవరైనా లంచం అడిగితే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీఎస్పీలు శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మీకాంత్‌రెడ్డి, చలపతి, రాజేశ్ సూచించారు. ‘విజిలెన్స్ అవగాహన వారోత్సవం-2026’లో భాగంగా బుధవారం హైదరాబాద్ రవాణా కమిషనర్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ అవినీతిని రూపుమాపడం ఉద్యోగులతోపాటు ప్రతిపౌరుడి బాధ్యత అని స్పష్టంచేశారు. లంచం ఇవ్వడం, తీసుకోవడం చట్టరీత్యా నేరాలేనని పేర్కొన్నారు. రవాణా శాఖ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు చంద్రశేఖర్ గౌడ్, శివలింగయ్య, వెంకటరమణ మాట్లాడుతూ ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న రవాణా శాఖలో ప్రతి ఉద్యోగి జవాబుదారీతనంతో, సేవాభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. పౌరులకు పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించేందుకు రవాణా శాఖ అనేక సంసరణలు చేపట్టిందని వివరించారు. కొత్త వాహనం కొనుగోలు చేసిన షోరూం వద్దనే రిజిస్ట్రేషన్ పూర్తవుతున్నదని, యాజమాన్య బదిలీ, లెర్నర్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్, డూప్లికేట్, చిరునామా మార్పు వంటి సేవలు ఆన్లైన్లోనే అందుబాటులో ఉన్నాయని వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

