జూన్ 2 నుంచి మూడువారాలపాటు తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలు అట్టహాసంగా సాగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా జూన్ 2 నుంచి 22వ తేదీవరకు రోజువారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. దశాబ్ది ఉత్సవాలపై మంగళవారం సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. 21 రోజుల్లో ప్రతిరోజూ ఓ రంగానికి ప్రాధాన్యం కల్పించారు. అమరవీరులకు ఘన నివాళులతో ప్రారంభమయ్యే దశాబ్ది ఉత్సవాలు.. ట్యాంక్‌బండ్ ఒడ్డున నిర్మించిన అమరుల స్మృతిచిహ్నం ప్రారంభంతో ముగియనున్నాయి.
జూన్ 2 : ఉత్సవాలు ప్రారంభం. అమరులకు నివాళి, పతాకావిష్కరణ.
జూన్ 3 : రైతు దినోత్సవం. కర్షకులతో కలిసి సహపంక్తి భోజనాలు
జూన్ 4 : సురక్షా దినోత్సవం. పోలీసుశాఖ కార్యక్రమాలు
జూన్ 5 : తెలంగాణ విద్యుత్తు విజయోత్సవం. సింగరేణి సంబురాలు
జూన్ 6 : పారిశ్రామిక ఉత్సవం. ఇండస్ట్రియల్, ఐటీ కారిడార్లలో సభలు
జూన్ 7 : సాగునీటి దినోత్సవం. విజయాలపై సభలు
జూన్ 8 : చెరువుల పండుగ. సాంస్కృతిక హేల, కట్టలపై భోజనాలు
జూన్ 9 : తెలంగాణ సంక్షేమ సంబురాలు. లబ్ధిదారులతో సభలు
జూన్ 10 : తెలంగాణ సుపరిపాలన దినోత్సవం
జూన్ 11 : సాహిత్య దినోత్సవం.కవి సమ్మేళనాలు, కవితల పోటీలు
జూన్ 12 : తెలంగాణ రన్. పోలీసుశాఖ ఆధ్వర్యంలో పరుగులు
జూన్ 13 : మహిళా సంక్షేమ దినోత్సవం. మహిళా ఉద్యోగులకు సన్మానం
జూన్ 14 : వైద్యారోగ్య దినోత్సవం. నిమ్స్ విస్తరణకు సీఎం శంకుస్థాపన
జూన్ 15 : పల్లెప్రగతి దినోత్సవం.ఉత్తమ సర్పంచులు, ఎంపీపీలకు సన్మానం
జూన్ 16 : తెలంగాణ పట్టణప్రగతి దినోత్సవం
జూన్ 17 : గిరిజనోత్సవం. గిరిజన గ్రామాల్లో కార్యక్రమాలు
జూన్ 18 : మంచినీళ్ల పండుగ. తాగునీటి విజయాలపై సభలు
జూన్ 19 : హరితోత్సవం. మొక్కలు నాటే కార్యక్రమాలు
జూన్ 20 : తెలంగాణ విద్యా దినోత్సవం
జూన్ 21 : ఆధ్యాత్మిక దినోత్సవం. ప్రత్యేక పూజలు, ప్రార్థనలు
జూన్ 22 : అమరులకు నివాళి. స్మారక చిహ్నం ప్రారంభం