రాష్ర్టానికి ఏడు పతకాలు, ఆంధ్రాకు ఒకటి
హైదరాబాద్, ఫిబ్రవరి 6 : అంక గణిత పోటీల్లో తెలంగాణ ప్రతిభ చాటింది. దేశంలోనే అతిపెద్దదైన ఎస్ఐపీ సంస్థ ఆదివారం ఆన్లైన్లో అర్థమెటిక్ జీనియస్ కాంటెస్ట్(ఏజీసీ)ను నిర్వహించింది. ఈ పోటీల్లో పశ్చిమబెంగాల్ 8 పతకాలు సాధించగా, తెలంగాణ 7, ఆంధ్రప్రదేశ్ ఒక పతకం సాధించాయి. ఏడుగురు హైదరాబాద్‌కు చెందిన విద్యార్థులు, తిరుపతికి చెందిన ఒక విద్యార్థి పతకాలు సాధించిన వారిలో ఉన్నారు. జీ రహిత, టీ ఆశ్రిత, నూతన్ భార్గవ్ వివిధ విభాగాల్లో దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచారు. వైదిక్, గోపేశ్, కీర్తనసాయి శ్రీపాద, సరయు, సీ సత్య అత్యుత్తమ ప్రదర్శనకుగాను పతకాలు సాధించారు. విజేతలకు డీఆర్డీవో డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెస్సీ థామస్ బహుమతులు అందజేశారు. అందరికీ సహజమైన మే ధస్సు ఉంటుందని, దాన్ని మెరుగుపరుచుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంటుందని థామస్ పేర్కొన్నారు. ఈ పోటీలను 2000 మంది టీచర్లు పర్యవేక్షించారు.