930 కోట్లతో 8 మెడికల్ కాలేజీలు
కొత్తగా మంజూరైన 8 మెడికల్ కాలేజీలకు రూ.930 కోట్లతో నూతన భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆన్లైన్లో టెండర్లను ఆహ్వానించింది. ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి జూన్ 8 మధ్యాహ్నం 3:30 గంటల వరకు టెండర్లను స్వీకరిస్తారు
నిర్మాణానికి ఆర్ అండ్ బీ శాఖ టెండర్లు
18 నుంచి జూన్ 8 వరకు అవకాశం
హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): కొత్తగా మంజూరైన 8 మెడికల్ కాలేజీలకు రూ.930 కోట్లతో నూతన భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆన్లైన్లో టెండర్లను ఆహ్వానించింది. ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి జూన్ 8 మధ్యాహ్నం 3:30 గంటల వరకు టెండర్లను స్వీకరిస్తారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు టెక్నికల్ బిడ్లు ఓపెన్ చేస్తారు. సాంకేతిక అర్హతలు ఉన్న వాటిని పరిశీలించి ఎంపిక చేస్తారు. ప్రైస్ బిడ్‌ను జూన్ 14 మధ్యాహ్నం 2 గంటలకు తెరుస్తారు. జూన్ 1న మధ్యాహ్నం 3 గంటలకు రోడ్లు, భవనాల శాఖ కార్యాలయంలో ఈఎన్సీ గణపతిరెడ్డి ప్రీ బిడ్ మీటింగ్‌ను నిర్వహిస్తారు. కాంట్రాక్టర్లను ఎంపిక చేసి, ఆ జాబితాను కమిషనరేట్ ఆఫ్ టెండర్స్‌కు పంపిస్తారు.
అక్కడి నుంచి అప్రూవల్ రాగానే రోడ్లు, భవనాల శాఖ లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్(ఎల్వోఏ) ఇస్తారు. దీని తర్వాత 15 రోజులు సమయం ఇస్తారు. కాంట్రాక్ట్ అగ్రిమెంట్‌పై సంతకాలన్నీ పూర్తయ్యాక పనులు మొదలుపెడతారు. పనులు చేపట్టిన కాంట్రాక్టర్.. 15 నెలల్లో మెడికల్ కాలేజీలు నిర్మించి అప్పగించాల్సి ఉంటుంది. ఈ నిబంధనను టెండర్ షెడ్యూల్లో రోడ్లు, భవనాల శాఖ పొందుపరిచింది. కాగా, రాష్ట్ర ప్రజలకు అత్యాధునిక వైద్య సదుపాయాలు కల్పించాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. జిల్లాకో వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని భావించారు. ఇందులో భాగంగా 8 మెడికల్ కాలేజీల్లో ఈ ఏడాది నుంచి తరగతులు ప్రారంభించటానికి చర్యలు తీసుకొన్నారు. అలాగే కాలేజీలకు శాశ్వత భవనాలను నిర్మించాలని సంకల్పించారు. ఇందులో భాగంగానే త్వరితగతిన టెండర్లు ఆహ్వానించి, నిర్మాణ పనులు ప్రారంభించాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని, ఇంజినీరింగ్ అధికారులను సీఎం ఆదేశించారు. దీంతో అధికారులు టెండర్లను ఆహ్వానించారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

