హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కే తారకరామారావుతోపాటు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్రెడ్డిపై ఎమ్మెల్సీ చింతపండు నవీన్‌కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న నమోదు చేసిన కేసును హైకోర్టు డిస్మిస్ చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నకిలీ వీడియోలతో తన ప్రతిష్ఠను దెబ్బతీశారని తీన్మార్ మల్లన్న ఫిర్యాదు చేయడంతో మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. దీన్ని కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్, జగదీశ్‌రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై గతంలోనే విచారణ పూర్తిచేసిన జస్టిస్ మౌసమీ భట్టాచార్య.. శుక్రవారం తీర్పును వెలువరించారు.