హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): కారాగారాల్లో నాణ్యమైన సాంకేతిక విద్య అందించడం ఎంతో అవసరమని జైళ్లశాఖ డీజీ సౌమ్యామిశ్రా అన్నారు. సోమవారం చర్లపల్లి కేంద్ర కారాగారాన్ని సందర్శించి, ప్రభుత్వ ఐటీఐ ఏర్పాటు కోసం జరుగుతున్న మౌలిక వసతుల అభివృద్ధి, అఫిలియేషన్ ప్రక్రియలు, ఇతర సన్నాహక పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఖైదీల పునరావాసం, నైపుణ్యాభివృద్ధిని బలోపేతం చేయాలనే లక్ష్యంతో చర్లపల్లి సెంట్రల్ జైలు ప్రాంగణంలో ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ) ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్టు తెలిపారు.