నారాయణపేట : నారాయణపేట(Narayanpet) జిల్లా మరికల్ మండలం కనుమనూరు గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్‌ను( BRS flexi) మంగళవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చించి వేశారు. బుధవారం ఉదయం గ్రామ బీఆర్ఎస్ నాయకులు రమేష్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి మరికల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే ఇలాంటి దుస్సంఘటనలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మరికల్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నిందితులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు స్టేషన్ ఏఎస్ఐ ఎల్లయ్య తెలిపారు.
పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు