హైదరాబాద్, సెప్టెంబర్16 (నమ స్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా కొన్నేండ్లుగా కలప ఉత్పత్తి తగ్గింది. గృహ నిర్మాణాలు పెరగడంతో డిమాండ్‌కు సరిపడా కలప దొరకడంలేదు. దీంతో కలప అవసరాలు తీర్చుకునేందుకు విదేశీ దిగుమతులపై ఆధారపడాల్సి వస్తున్నది. అటవీప్రాంతాలు దండిగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లోనూ ఇలాం టి వాతావరణం నెలకొనడం ఆందోళ న కలిగిస్తున్నది. స్థానిక కలప లభ్యత తగ్గిపోవడంతో ధర కూడా పెరిగింది. విదేశాల నుంచి భారీగా టేకు కర్ర దిగుమతి అవుతుండటం, వాటి ధర కొంత తకువగా ఉండటంతో వ్యాపారులంతా దానినే ఉపయోగిస్తున్నారు.
ప్రస్తుతం వినియోగించే టేకు కలపలో 80 శాతానికిపైగా విదేశాల నుం చి దిగుమతి చేసుకుంటున్నారు. మరికొంత ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, మ హారాష్ట్ర నుంచి వస్తున్నది. విదేశాల నుంచి ఏటా లక్షన్నర క్యూబిక్ మీటర్లకుపైగా కలప దిగుమతి అవుతున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఎనిమిది వేల క్యూ బిక్ మీటర్లకుపైగా టేకు కలప అమ్ముడవుతున్నట్టు తెలిపారు.
భారత్‌కు ఇండోనేషియా, సూడా న్, గనా, బ్రెజిల్, ఈక్వెడార్, శ్రీలంకతోపాటు పలు ఆఫ్రికన్ దేశాల నుంచి కలప దిగుమతి అవుతున్నది. సముద్ర మార్గంలో కోల్‌కతా, గుజరాత్, ముంబై, చెన్నై, విశాఖపట్టణం పోర్టులకు ఓడల ద్వారా కలపను పంపిస్తున్నారు. అకడినుంచి ట్రకులు, కంటెయినర్లలో వివిధ ప్రాంతాలకు రవా ణా చేస్తున్నారు. గుజరాత్‌లోని కాం డ్లా పోర్టు నుంచి సమీపంలోని గాంధీధామ్‌లో ఉన్న ప్రధాన వాణిజ్య కేం ద్రానికి కర్రను పంపిస్తారు.
అకడినుంచి రోడ్డు మార్గంలో మహారాష్ట్రలోని నాగ్‌పూర్, హైదరాబాద్‌కు టేకు రవాణా అవుతున్నది. తెలంగాణ, ఆం ధ్రప్రదేశ్ కలప అవసరాలను నాగ్‌పూర్ మారెటు తీరుస్తున్నది. ఈ నగరంలో 300కుపైగా కలప మిల్లులున్నాయి. ఇకడి వ్యాపారులు అవసరమైతే ఆయా దేశాలకు స్వయంగా వెళ్లి నాణ్యతను పరిశీలించి, కావాల్సిన సరకును ఆర్డర్ చేసి తీసుకుంటారు. గతంలో బర్మా (మయన్మార్) టేకును ఎకువగా ఉపయోగించేవారు. ప్రస్తు తం ఆ దేశం తన అవసరాల దృష్ట్యా ఎగుమతులు నిలివేయడంతో మిగతా దేశాలు ఎగుమతులను పెంచాయి.