హైదరాబాద్ : పాఠశాలలో ఉపాధ్యాయులకు అల్పాహారం (Breakfast ) , మధ్యాహ్న భోజనం ( Lunch ) పెడుతామని ప్రభుత్వం చేసిన ప్రకటనపై ఉపాధ్యాయ సంఘాలు( Teachers Union ) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమ డిమాండ్లు నెరవేర్చమంటే టిఫిన్లు పెడుతున్నాము, భోజనం పెడుతున్నామంటూ వెటకారంగా చిన్నచూపు చూడాల్సిన అవసరం లేదని ఆరోపించారు.
ప్రభుత్వం తమకు భోజనం పెట్టాల్సిన అవసరం లేదని, తామే ఇంటి నుంచి తెచ్చుకుంటామని పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షం గౌడ్ వెల్లడించారు. ప్రభుత్వం నిధులు ఇచ్చినా, ఇవ్వకపోయినా ప్రతి ఉపాధ్యాయుడు తమతమ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని గమనించాలని కోరారు.