హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): జీవో-317 బాధిత టీచర్ల సమస్యలను పరిష్కరించాలని పీఆర్టీయూ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. గురువారం ఆ సంఘం నేతలు హైదరాబాద్‌లోని నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డికి వినతిపత్రాన్ని సమర్పించారు. కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షుడు గార్లపాటి ఉమాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ పర్వతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.