జమ్మికుంట, నవంబర్15 : కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ పాథమిక పాఠశాలలో ఇటీవల మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా విద్యాధికారి మొండయ్య చర్యలు చేపట్టారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులు విద్యార్థులకు కుళ్లిన గుడ్లతో భోజనం అందించారని, దీంతో 26 మంది వాంతులు, కడుపునొప్పితో అస్వస్థతకు గురి అయ్యారని మండల విద్యాధికారి హేమలత ఉన్నతాధికారులకు నివేదిక అందించారు.
దీని ఆధారంగా మధ్యాహ్న భోజన నిర్వాహకులను తొలగించాలని డీఈవో ఆదేశాలు జారీచేశారు. ఉపాధ్యాయుడు విమ్ శ్రీనివాస్ నిర్వాహకులను ప్రశ్నించడం.. విద్యార్థుల తల్లిదండ్రులకు, మీడియాకు మధ్యాహ్న భోజనం పథకం తీరును తప్పుబడుతూ వివరించడం.. హెచ్ఎం, ఉపాధ్యాయులను బ్లాక్మెయిల్ చేయ డం.. తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని సదరు టీచర్‌ను సస్పెన్షన్ చేస్తూ డీఈవో శనివారం ఉత్తర్వులు జారీ చేశా రు. ఉత్తర్వుల కాపీని కాంప్లెక్స్ హెచ్ఎం సురేశ్, శ్రీనివాస్‌కు అందించారు.