హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ఉపాధ్యాయులంతా పనిచేయాలని టీచర్ ఎమ్మెల్సీలు ఏవీఎన్‌రెడ్డి, మల్క కొమురయ్య పిలుపునిచ్చారు. ఆదివారం నారాయణగూడ కేశవ్ మెమోరియల్ పాఠశాలలో నిర్వహించిన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) రాష్ట్ర కార్యనిర్వాహకవర్గ సమావేశంలో వారు మాట్లాడారు. సెప్టెంబర్ 1న నిర్వహించే ‘హమారా విద్యాలయ్ – హమారా స్వాభిమాన్’ కార్యక్రమ పోస్టర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి నవాత్ సురేశ్, తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : రిటైర్డ్ ఉద్యోగులను సింగరేణి సంస్థ విస్మరిస్తున్నదని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దండంరాజు రామచందర్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. చాలీచాలని పెన్షన్‌తో ఉద్యోగులు దుర్లభమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారని, సీఎండీ ఎన్ బలరామ్ చొరవ తీసుకుని మెరుగైన వైద్యసదుపాయాలు కల్పించాలని కోరారు.