టెన్త్ మూల్యాంకన రేట్లు పెంచండి.. సీఎం రేవంత్‌రెడ్డిని కోరిన ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి
పదో తరగతి మూల్యాంకన రేట్లు పెంచాలని టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి కోరారు. 2018 లో చివరిగా మూల్యాంకన రేట్లు పెంచారని, అప్పటినుంచి పెంచలేదని, ఇప్పుడైనా పెంచాలని కోరుతూ సోమవారం అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
- ఆధార్మిస్ మ్యాచ్ ఉద్యోగులకు మరో అవకాశమివ్వండి
హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి మూల్యాంకన రేట్లు పెంచాలని టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి కోరారు. 2018 లో చివరిగా మూల్యాంకన రేట్లు పెంచారని, అప్పటినుంచి పెంచలేదని, ఇప్పుడైనా పెంచాలని కోరుతూ సోమవారం అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. దీంతోపాటు రాష్ట్రంలో 5వేల మంది రెగ్యులర్ ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆధార్ కార్డును ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో అనుసంధానం చేయకపోవడం, ఆధార్ మిస్మ్యాచ్కావడంతో ఫిబ్రవరి నెల వేతనాలు అందలేదని తెలిపారు. ఆధార్ అనుసంధానించేందుకు మరో అవకాశం కల్పించాలని కోరారు. ఇప్పటికే ఐదు వేల మంది ఉద్యోగులకు నెల వేతనాలు అందలేదని, మరో అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. సీఎంను కలిసిన వారిలో పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామోదర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్, అధికార ప్రతినిధి వంగ మహేందర్‌రెడ్డి, ఆడిట్ చైర్మన్ సోమిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నారు.
ఆధార్ అప్డేట్కు 26 వరకు చాన్స్
ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం (ఐఎఫ్ఎంఐఎస్) పోర్టల్‌లో ప్రభుత్వ ఉద్యోగులు ఆధార్ అప్డేట్ చేసుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈ నెల 26లోపు ఆధార్ డాటా వివరాలు అప్డేట్ చేయాలని సూచించింది. ప్రభుత్వశాఖల కార్యదర్శులు, హెచ్వోడీలు, అధికారులు తగు ఆదేశాలిచ్చి ప్రక్రియను పూర్తిచేయాలని ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా ఆదేశించారు.
సెన్సస్ ‘మైక్రో-డాటా వర్క్ స్టేషన్’కు ఎంవోయూ
హైదరాబాద్, మార్చి 23(నమస్తే తెలంగాణ): సెన్సెస్ ‘మైక్రో-డాటా వర్క్ స్టేషన్’కు హైదరాబాద్ యూనివర్సిటీతో ఎంవోయూ కుదుర్చుకున్నట్టు రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ భారతి హోళికేరి వెల్లడించారు. హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జనాభా డెఫ్త్ డెమోగ్రఫిక్ అధ్యయనం, కస్టమైజ్డ్ అనాలసిస్, పాలసీ ఇం పాక్ట్‌కు ఈ ఒప్పందం కీలకం కానున్నదని తెలిపారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మొదటి సెన్సస్ మైక్రోడాటా రీసెర్చ్ వర్క్ స్టేషన్ ఇదే అని వెల్లడించారు. కార్యక్రమంలో సెన్సస్ డిప్యూటీ రిజిస్ట్రార్ జనరల్ జ్ఞానశంకర్, అసిస్టెంట్ డైరెక్టర్లు రాజీవ్, గుర్వీందర్ సింగ్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వీసీ జే అనురాధ, రిజిస్ట్రార్ దేవేష్ నిగమ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

