హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో టీచర్ ఎమ్మెల్సీ పోరు ఆసక్తిరేపుతున్నది. పలు సంఘాల నేతలు పోటీలో దిగగా, ఓటర్లు ఎవరికి అండగా నిలుస్తారన్నది ఉత్కంఠ రేపుతున్నది. రెండు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు మరో వారంలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే పలు సంఘాలు తమ అభ్యర్థులను ఖరారుచేయగా, ఆయా అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లా టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీపడే అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉంది. ఈ స్థానం నుంచి మల్క కొమురయ్య (తపస్ -బీజేపీ), మహేందర్‌రెడ్డి (పీఆర్టీయూ టీఎస్), ఇన్నారెడ్డి (సీపీఎస్ఈయూ) నుంచి తలపడుతున్నారు. అయితే నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి బహుముఖ పోటీ నెలకొంది. ఈ స్థానం నుంచి పలువురు కీలక నేతలు పోటీచేస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ నర్సిరెడ్డి (టీఎస్ యూటీఎఫ్), పింగిలి శ్రీపాల్‌రెడ్డి (పీఆర్టీయూ టీఎస్), పులి సరోత్తంరెడ్డి (తపస్ -బీజేపీ), మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ (జాక్టో), హర్షవర్ధన్‌రెడ్డి (పీఆర్టీయూ తెలంగాణ) నుంచి ఖరారయ్యారు. టీచర్ ఎమ్మెల్సీ ఓటర్లుగా ప్రభుత్వ, జిల్లా పరిషత్ టీచర్లతోపాటు కేజీబీవీ, మాడల్ స్కూల్, గురుకుల టీచర్లు, జూనియర్, డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, యూనివర్సిటీ టీచర్లు ఓటర్లుగా ఉన్నారు. ఎన్నికల వేళ టీచరు సమస్యలను ఏకరువుపెడుతున్నారు. కొత్త డిమాండ్లను తెరపైకి తీసుకొస్తున్నారు.
టీచర్ల ప్రధాన డిమాండ్లు ఇవే..