హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : టీచర్ ఎమ్మెల్సీగా తనను మరోసారి గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ ఓటర్లను అభ్యర్థించారు. గతంలో ఎమ్మెల్సీగా ఆరేండ్లపాటు అవినీతికి తావులేకుండా, మచ్చలేకుండా టీచర్లకు సేవలందించానని, తనకు మరోసారి అవకాశం కల్పించాలని ఆయన కోరారు. శనివారం ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పూల రవీందర్ మాట్లాడారు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల టీచర్లు తనను ఆశీర్వదించాలని కోరారు.