మద్దూర్, మార్చి 24 : ఓ విద్యార్థినిపట్ల ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని జడ్పీహెచ్ఎస్లో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినితో ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన వీడియో బయటికిరావడంతో కాంగ్రెస్ నేతలు విద్యార్థిని తల్లిదండ్రులు, ఉపాధ్యాయుడితో మాట్లాడి సమస్యను బయటకు రాకుండా చేసిన ట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
వనపర్తి టౌన్, మార్చి 24 : బాలికపై లైంగికదాడి చేసిన నిందితుడికి వనపర్తి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత 20ఏండ్ల జైలుశిక్ష, రూ.30వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్టు ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలానికి చెందిన తొమ్మిదో విద్యార్థిని ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ముడావత్ రాజు లైంగికదాడికి పాల్పడ్డాడు.