హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఈసారి టెట్ పేపర్-1కు 2,69,557 దరఖాస్తులు, పేపర్-2కు 2,08,498 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 15న ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో పేపర్‌కు పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఏడాది 1,139 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో అత్యధికంగా 92, అతి తక్కువగా ములుగు జిల్లాలో 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు రాష్ట్ర విద్యా శిక్షణ పరిశోధన సంస్థ (ఎస్సీఈఆర్టీ) అధికారులు హాల్‌టికెట్లను వెబ్సైట్లో పొందుపరిచారు. దరఖాస్తుల్లో తప్పులుంటే పరీక్ష రోజు సవరించుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఇన్విజిలెటర్‌ను సంప్రదించి తప్పుగా నమోదైన వివరాలను నామినల్ రోల్స్‌లో సవరించుకోవచ్చని సూచించారు. ఇదే విషయాన్ని హాల్టికెట్లల్లోనూ పొందుపరిచారు.
టెట్ అభ్యర్థులకు సూచనలు