ఏటూరునాగారం, డిసెంబర్ 24 : ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు మద్యం తాగి విధులకు హాజరై అయ్యప్ప భక్తుడిపై చిందులేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. గ్రామంలో ఫోన్ సిగ్నల్ సరిగా లేకపోవడంతో మంగళవారం సదరు భక్తుడు అక్కడి పాఠశాల భవనంపైకి వెళ్తున్న క్రమంలో మద్యం తాగి ఉన్న ఓ ఉపాధ్యాయుడు దురుసుగా ప్రవర్తించాడు. ఉపాధ్యాయుడి వీరంగాన్ని అయ్యప్ప భక్తుడు ఫోన్లో వీడియో తీశాడు. వీడియో ఎందుకు తీస్తున్నావంటూ ఉపాధ్యాయుడు మొబైల్‌పై కొట్టడంతో కింద పడిపోయింది. ఇటీవల ఎస్స్ఎఫ్ఐ విద్యార్థులు సైతం కొండాయిలో ఓ ఉపాధ్యాయుడు మద్యం తాగి విధులకు హాజరవుతున్నాడంటూ ఆరోపించిన విష యం తెలిసిందే.