హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జోనల్ వ్యవస్థకు అనుగుణంగా ఉపాధ్యాయుల కేటాయింపు సజావుగా పూర్తయింది. ఉపాధ్యాయులు ఇచ్చిన వివరాల ఆధారంగా కేటాయింపులు జరిపిన విద్యాశాఖ.. భార్యాభర్తలు ఒకేచోట పనిచేసేందుకు వీలు కల్పించింది. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే అప్పీలు చేసుకొనే వెసులుబాటు కూడా ఇచ్చింది. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పోస్టింగుల్లో మారుమూల ప్రాంతాలకు ప్రాధాన్యం కల్పించారు. కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఒకటి రెండుచోట్ల ఉపాధ్యాయులు వివరాలు సరిగా
ఇవ్వకపోవడంతో కేటాయింపుల్లో సమస్యలు తలెత్తాయి. అయినప్పటికీ పొరపాట్లు జరిగినచోట అప్పీల్ చేసుకోవచ్చని విద్యాశాఖ మంత్రి సూచించారు. ఉపాధ్యాయులు ఇచ్చిన వివరాల ఆధారంగానే సీనియారిటీని నిర్ధారించి కేటాయింపులు జరిగాయని, ఎక్కడా టీచర్లను ఇబ్బంది పెట్టలేదని అధికారులు స్పష్టంచేశారు. ఎక్కడైనా ఉపాధ్యాయులు వివరాలు ఇవ్వడంలో పొరపాటుచేస్తే మళ్లీ వారికి అప్పీల్‌కు అవకాశం కల్పించామని, ఇంకా ప్రక్రియ కొనసాగుతుండగానే ఆందోళనకు దిగడం సరికాదని సూచించారు. సమస్యలు ఉన్నచోట పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.
సజావుగా ఉపాధ్యాయుల కేటాయింపు
ఉపాధ్యాయుల కేటాయింపు సజావుగానే సాగింది. ఎటువంటి పొరపాట్లు జరుగలేదు. ఇతర సంఘాలు వ్యక్తంచేస్తున్న అభ్యంతరాలపై మేము ఎలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదు. -కమలాకర్, పీఆర్టీయూ-తెలంగాణ ప్రధాన కార్యదర్శి