టీ హబ్ ది బెస్ట్
దేశంలోనే అత్యుత్తమ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్‌గా టీ హబ్‌కు ప్రత్యేక గుర్తింపు లభించింది. నేషనల్ టెక్నాలజీ డేను పురస్కరించుకొని ఢిల్లీలో ఆదివారం జరిగిన నేషనల్ టెక్నాలజీ వీక్-2003 కార్యక్రమంలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీశాఖ మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ చేతులమీదుగా టీ హబ్ సీఈవో ఎంఎస్ రావు ఈ అవార్డును అందుకున్నారు.
- అత్యుత్తమ టెక్నాలజీ బిజినెస్
- ఇంక్యుబేటర్‌గా కేంద్రం గుర్తింపు
- నేషనల్ టెక్నాలజీ అవార్డు ప్రదానం
- ఢిల్లీలో అందుకున్న టీ హబ్ సీఈవో
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 14 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అత్యుత్తమ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్‌గా టీ హబ్‌కు ప్రత్యేక గుర్తింపు లభించింది. నేషనల్ టెక్నాలజీ డేను పురస్కరించుకొని ఢిల్లీలో ఆదివారం జరిగిన నేషనల్ టెక్నాలజీ వీక్-2003 కార్యక్రమంలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీశాఖ మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ చేతులమీదుగా టీ హబ్ సీఈవో ఎంఎస్ రావు ఈ అవార్డును అందుకున్నారు. దేశంలోనే అత్యుత్తమ స్టార్టప్ ఇంక్యుబేటర్ అవార్డును టీ హబ్ ఫిబ్రవరిలో అందుకున్నది. నాలుగు నెలల వ్యవధిలోనే టీ హబ్‌కు జాతీయ స్థాయిలో రెండు అవార్డులు రావడం తెలంగాణకే గర్వకారణమని ఐటీశాఖ అధికారులు తెలిపారు. టీ హబ్‌కు నేషనల్ టెక్నాలజీ అవార్డు రావడం ఆనందంగా ఉన్నదని సీఈవో ఎంఎస్ రావు చెప్పారు. ఈ అవార్డు హైదరాబాద్ ఖ్యాతిని మరింత పెంచిందని తెలిపారు. రానున్న రోజుల్లో ఆవిషరణలు, స్టార్టప్‌ల విస్తరణ కార్యకలాపాల్లో మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తామని చెప్పారు. దేశంలో శక్తివంతమైన, విజయవంతమైన స్టార్టప్‌ల ఎకోసిస్టంను నిర్మించేందుకు టీ హబ్ అనుసరిస్తున్న విధా నం ఇతర సంస్థలకు స్ఫూర్తిగా నిలుస్తున్నదని పేర్కొన్నారు.
టీహబ్‌కు అభినందనలు
టీ హబ్ సాధించిన విజయాల పట్ల సంతోషంగా ఉన్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. నేషనల్ టెక్నాలజీ అవార్డు-2023ను టీ హబ్ గెలుచుకున్నందుకు గర్వంగా కూడా ఉన్నదని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీ హబ్ బృందానికి ఆయన అభినందనలు తెలిపారు. టీహబ్ భారతదేశంలో బెస్ట్ టెక్నాలజీ ఇంక్యుబెటర్గా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా గుర్తింపు పొందిందని కేటీఆర్ వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

